ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

On
ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

పాలాభిషేకం చేస్తున్న ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి నాయకులు

 రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు  గంగాపురం కిషన్ రెడ్డి పిలుపుమేరకు ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగులూరు ఎక్స్ రోడ్ యందు ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు శిగ వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  కృష్ణా ట్రిబ్యునల్ ,పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, మహిళలకు 33% రిజర్వేషన్  ప్రకటించినందుకు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగినది.కార్యక్రమానికి ముఖ్య అతిథి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పొట్టి రాములు  మాట్లాడుతూ తెలంగాణలో మార్పు బిజెపితోనే సాధ్యమని బీజేపీ పార్టీ రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని మా ప్రధానమంత్రి నెరవేరుస్తున్నారని స్పష్టం చేశారు. నిజాంబాద్ లో పసుపు బోర్డు ములుగులో సమ్మక్క సారక్కల పేర్లపై గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయునట్లు ప్రకటించడం కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని బ్రిజేష్ కుమార్ అప్పజెప్పి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం మనమంతా ఆశించదగ్గ విషయం తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆదరణతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు శిగ ప్రభాకర్ గౌడ్, మనోహర్ లాల్, ఆదిభట్ల మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు సిద్ధ గౌని గణేష్ గౌడ్, ఐలయ్య, ఆదిభట్ల మున్సిపాలిటీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లెపల్లి శ్రీదేవి, మహేష్, యాదగిరి, తులసిగారి కుమార్, రాజు, శ్రీశైలం, ఆంజనేయులు, పద్మ, శోభ, వరలక్ష్మి, మహేశ్వరి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన