కళ్యాణ లక్ష్మీ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది..
ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి..
కళ్యాణ లక్ష్మీ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది: ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యాలయంలో 240 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి హాజరై చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ దత్తు, డిప్యూటీ తాసిల్దార్ వై. రామకృష్ణ, ఎంపిపి బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జడ్పిటీసి బింగి దేవదాస్ గౌడ్, సర్పంచలు, ఎంపిటిసిలు కేశెట్టి వెంకటేష్, సీక సాయి కుమార్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List