సొంత పార్టీని, సొంత వర్గాన్నిహోల్ సేల్ గా అమ్మటానికే వ్యాపారి పవన్ పర్యటనలు
మీ బిడ్డ కడుతున్నవి ఇళ్లు కాదు..ఊళ్లు: సీఎం జగన్
గురువారం సామర్లకోటలో ఏర్పాటు చేసిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మీ బిడ్డ కడుతున్నవి ఇళ్లు కాదని, ఊళ్లని సీఎం జగన్ పేర్కొన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఇళ్లు లేని 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు
చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్ జైలులో ఉన్నారని సీఎం ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరని, చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంటుందని తెలిపారు. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదని ఆరోపించారు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదని, వీళ్లకి కావాల్సింది కేవలం అధికారమని, వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం, హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకోవటమే లక్ష్యంగా పని చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే అని పవన్ తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడని, ఆ ప్యాకేజీ స్టార్ సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి అని సీఎం జగన్ సామర్లకోటలో గృహప్రవేశాలు బహిరంగ సభలో విమర్శించారు
Comment List