సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చెన్నూరి రూపేష్
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా ఎస్పీగా శనివారం చెన్నూరి రూపేష్ ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన చెన్నూరి రూపేష్ బదిలీల్లో భాగంగా ఇవాళ
సంగారెడ్డి జిల్లాకు ఎస్పీగా వచ్చారు. ముందుగా జిల్లా పోలీసుల కార్యాలయానికి చేరుకున్న నూతన ఎస్పీ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, విధుల్లో చేరారు.సందర్భంగా చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో స్వేచ్చాయుత, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్పీ అన్నారు నేరాల నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ ఉండదని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని కోరారు.జిల్లాలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం లో జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కోరారు.
Views: 253
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jan 2026 17:35:40
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

Comment List