
ద్విచక్ర వాహనాల నిందితులు అరెస్టు...
ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు తరలించారు.
నింధితుల నుండి 10 లక్షల 40,000 వేల రూపాయలు విలువ చేసే ఒక ఆటో, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు గతంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు డిసిపి వెల్లడించారు.
అబ్దుల్లాపుర్మెట్, పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు బండారి శివ(23)తండ్రి వెంకటేష్, మచ్చ రూపేష్(20) తండ్రి నగేష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా పార్కింగ్ చేసిన వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎల్బీనగర్ డిసిపి సాయి శ్రీ తెలిపారు. బుధవారం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపి బీమ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిసిపి సాయి శ్రీ మాట్లాడుతూ... నింధితుల నుండి 10 లక్షల 40,000 వేల రూపాయలు విలువ చేసే ఒక ఆటో, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు గతంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు డిసిపి వెల్లడించారు.

కేసు చేదనలో చురుకుగా వ్యవహరించిన డిఐ వెంకట్రాంరెడ్డిని, కానిస్టేబుల్ లను ప్రశంసించి రివార్డు అందజేశారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List