టేక్మాల్ మండలంలో ఆర్ఎస్ కు బిగ్ షాక్ మాజీ జడ్పీటీసీ మొగులయ్య దామోదర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు, బారాస పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ జడ్పీటీసీ బేగారి మొగులయ్య దసరా పండగ రోజున రాష్ట్ర నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో బారాస పార్టీ ని వీడుతూ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయన మాట్లాడుతూ క్రాంతి కిరణ్ స్థానిక నాయకుడు అని చెప్పుకుంటూ నియోజకవర్గములో ఉన్న ఇతర స్థానిక దళిత నేతలని ఎదగనివకుండా అవమానించారని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో ఆందోల్ చరిత్రలోనే ఎవరికి రాని 30 నుండి 40 వేల మెజారిటీతో దామోదర రాజనర్సింహ విజయం సాధిస్తారు అని అన్నారు.రాబోయే రోజుల్లో ఇంకా భారీగా చేరికలు ఉంటాయని అన్నారు. ఆయన వెంట యువ నాయకులు వినోద్, భూషనం, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 11
Tags:

Comment List