విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

MLA తో పాటు తెలంగాణ ఉద్యమ నేత డా.చెరుకు సుధాకర్ పాల్గొన్నారు                         

On
విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

న్యూస్ ఇండియా తెలుగు (అక్టోబర్ 24)నల్గొండ జిల్లా స్టాపర్ :నకిరేకల్ పట్టణ కేంద్రంలో విజయదశమి సందర్భంగా,పలు దేవాలయాల్లో శమీ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  అనంతరం మాట్లాడుతూ. ..ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదన్నారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని ఆయన అన్నారు. అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని దసరా సందర్భంగా ఆయన కోరారు.

Views: 25

About The Author

Post Comment

Comment List

Latest News

వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసాసీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీదేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్...
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )