వడ్డెర లను ఎస్టీ జాబితాలో చేర్చాలి
వడ్డెర్ల కోసం పనిచేసే పార్టీకే మా మద్దతు
తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు
జనగామ జిల్లా
జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో
దండ్ల రాజు అధ్యక్షత తెలంగాణ వడ్డెర సంఘం జనగాం టౌన్ నూతన కమీటిని ఎన్నుకోవడం
జరిగింది.ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు విచ్చేసి జనగామ టౌన్ అధ్యక్షుడు గా దండ్ల రాజు ను ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు మాట్లాడుతూ వడ్డెర
సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.రాష్ట్ర
అధ్యక్షడు శివరాత్రి ఐలమల్లు మాట్లాడుతూ వడ్డెర జాతి అభ్యున్నతికి పని చేస్తున్న ఏకైక తెలంగాణ వడ్డెర సంఘం అని,రానున్న ఎన్నికల్లో వడ్డెర్ల కోసం పనిచేసే వారికే తమ మద్దతు ఉంటుందని, వడ్డెరలను ఎస్టి జాబితాలో చేర్చాలని ఎన్నో రోజుల నుండి పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,ఇకనైనా ప్రభుత్వం మేలుకొని వడ్డెర లను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.దశాబ్ద కాలం నుండి వడ్డెరలు చెమటను నమ్ముకొని,కష్టాన్ని నమ్ముకొని పని చేస్తున్నారని,ప్రపంచీకరణ,యాంత్రీకరణ నేపధ్యంలో నూతన యంత్రాలు వచ్చి వడ్డెర వృత్తి కనుమరుగు అవుతుందన్నారు.ప్రభుత్వం వడ్డెర లను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్,జిల్లా అధ్యక్షుడు
శివరాత్రి రాజు,టౌన్ ప్రధాన కార్యదర్శి పల్లెపు బాబు,ఉపాధ్యక్షుడు దండ్ల ఉప్పలయ్య,టౌన్ మహిళా అధ్యక్షురాలు రాపోల్ గంగామణి,యూత్ అధ్యక్షుడు ఇరుగదిండ్ల కళ్యాణ్,బోదాస్సు వెంకటేష్,రాజశేఖర్,దండ్ల కనకరాజు,నర్సింహులు,మైసయ్య,శ్రవణ్, జ్యోతి,కీర్తన,రజిని,కనక లక్ష్మీ,కవిత,వీరయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comment List