నకిరేకల్ నియోజకవర్గంలో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది

పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉంటే సరిపోదు బ్యాలెట్ పై చూపించాలి చెరుకుపల్లి రామలింగం

On
నకిరేకల్ నియోజకవర్గంలో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది

న్యూస్ ఇండియా తెలుగు ,నవంబర్ 7 (నల్గొండ జిల్లా ప్రతినిధి): నకిరేకల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకుపల్లి రామలింగం నామినేషన్ దాఖలు వేసినారు.రేపు లేదా మర్నాడు జనసేన సైనికులు అభిమానులతో భారీ ఎత్తున రాలి తో రెండవ సెట్టు నామినేషన్ వేస్తాం అని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది. ప్రతి ఒక్క కార్యకర్తలకు అభిమానులకు జనసైనికులకు పాత రోజులు వదిలి కొత్త రోజులకు ఆహ్వాన పలుకుదాం. నకిరేకల్ గడ్డపైన జనసేన జెండా ఎగరవేసేదాక జనసైనికులు నిదురపోవద్దు అని సూచించారు. పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉంటే సరిపోదు ఆ అభిమానాన్ని గాజు గ్లాస్ బ్యాలెట్ పై చూపించాలని అన్నారు. పాత పరిపాలన మనం చూసాం ,కొత్త పరిపాలన కోసం జనం కంకణం కట్టుకొని ఉన్నారు.కొత్త జెండా ఎగరాలంటే జనసేన జెండా ఎగరాలే నకిరేకల్ కచ్చితంగా భారీ మెజార్టీతో జనసేన జెండా ఎగురుతుందని అన్నారు.

Views: 14

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News