ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

బి.యన్ రెడ్డి నగర్లో మార్నింగ్ వాక్ విత్ మధుయాష్కీ..

On
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

IMG_20231111_110933
ప్రచారంలో దూసుకుపోతున్న ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్..

బి.యన్ రెడ్డి నగర్లో మార్నింగ్ వాక్ విత్ మధుయాష్కీ..

బి.యన్ రెడ్డి నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మధు యాష్కీ గౌడ్  స్వామి వివేకానంద పార్క్ లో మార్నింగ్ వాక్ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాలనీ వాసులతో, అడుగులో అడుగేస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ నడక కొనసాగించారు. మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ, మాది పీపుల్స్ మేనిఫెస్టో, మీ సమస్యలను మా మేనిఫెస్టోలో పెడతాం. మీ సమస్యలను పరిష్కరించడమే నా యొక్క లక్ష్యం అన్నారు. సమయాభావం వల్ల ఎన్నికల ముందు ప్రతి ఇంటికి నేను రాలేకపోవచ్చు. రేపు మీ ఎమ్మెల్యేగా  ప్రతి ఇంటికి వచ్చి మీ కాలనీ సమస్యలు అధికారుల సమక్షంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మన ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ గంజాయి బ్యాచ్ నాయకుల బారి నుండి మన ఎల్బీనగర్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం, మనందరం కలిసి భాధ్యతగా ఎల్బీనగర్ను లిక్కర్ ఫ్రీ, గంజా ఫ్రీ, కబ్జా ఫ్రీ,కరప్షన్ ఫ్రీ, కమీషన్ ఫ్రీ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ మకుటం సదాశివ తదితర ముఖ్య నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన  హరగోపాల్ గౌడ్ సాయి గణేష్ మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
మాజీమంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గారిని పరామర్శించిన దేశగాని  హరగోపాల్ గౌడ్  NSUI  పాలకుర్తి...
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ
500 రూపాయలకే… 16 లక్షల విలువైన 66 గజాల ఇంటి స్థలం