రాబోయేది ఇందిరమ్మ రాజ్యం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
గెలిచిన వెంటనే లింకు రోడ్లు పూర్తిచేస్తా మాజీ ఎమ్మెల్యే
న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 14 (నల్గొండ జిల్లా ప్రతినిధి ):కట్టంగూరు మండల పరిధిలోని ఐటి పాముల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ ఆర్ గ్యారంటీ పథకాల గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ రాజ్యం కచ్చితంగా వస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు ఈ డబ్బంతా ప్రజలది కాబట్టి ప్రజల కోసమే ఖర్చు పెడతామని అన్నారు.కెసిఆర్ ప్రజల డబ్బు తీసుకుపోయి కాలేశ్వరం ప్రాజెక్టులో పోశాడు అని తెలియజేశారు. ఐటి పాముల లిఫ్ట్ ఇరిగేషన్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పై స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు చిత్తశుద్ధి లేదని చెప్పారు . బెజవాడ సరోజిని ఎన్నోసార్లు అవమానించారని నాకు తెలియజేసింది ఇలాంటి సమస్యలు పలు గ్రామాల నుంచి నా దాకా వచ్చాయి అన్నారు. ఇంకెంతకాలం లేదు ఆయన కథ ఒడిసిపోయిందని ఆయన దగ్గర సరుకు లేదని సబ్జెక్ట్ లేదని విమర్శించాడు. ఈ గ్రామం నుండి పలు గ్రామాలకు లింకు రోడ్లు అలాగే మార్కెట్ యార్డ్ గెలిచిన వెంటనే నిర్మిస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి మాద యాదగిరి,పెద్ది సుక్కయ్య, జల్లముత్తిలింగం ,సుంకర బోయిన నరసింహ, కొండ లింగస్వామి, సర్పంచి బెజవాడ సరోజినీ సైదులు, ఉపసర్పంచి ముత్యాల లింగయ్య, వార్డు మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comment List