మేము ఓట్లు వేయం.. ఎందుకు వేయాలి.....??
కనీసం పట్టించుకోవడం లేదంటూ
On
న్యూస్ ఇండియా తెలుగు, సెప్టెంబర్ 17
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని మారుమూల గొత్తికోయ గ్రామాల ప్రజలు ఓట్లు వేసేందుకు నిరాకరిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల గద్దెనెక్కిన పాలకులు వారిని , వలసవాదులంటూ నెపాన్ని మోపి అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏజెన్సీలోని గొత్తికోయ గిరిజన ప్రాంతాల్లోని గొత్తి కోయ గ్రామాల ప్రజలంతా తమకు రాజ్యాంగపరంగా వచ్చే ఒక్క ఓటు హక్కు మినహా ఏ ఇతర సౌకర్యాన్ని కూడా సంవృద్ధిగా అందించని పాలకులు మళ్ళీ ఓట్ల కోసం తమ గ్రామాలకు వస్తున్నారని వేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా వాస్తవానికి కష్టపడి చదువుకున్న గొత్తికోయ యువతచదువు చట్టుబండలుగా మారుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
జిల్లాలోని అశ్వారావుపేట మండల గొత్తికోయ గిరిజన ప్రాంతాల్లో. ఈ గ్రామాలలో సుమారు 600ల నుంచి 700ల వరకు జనాభా కలిగి ఉన్నప్పటికీ వీరికి సరైన గుర్తింపు లేదు. బచ్చువారి గుడెం,గాండ్లగూడెం, గ్రామ పంచాయితీలో గల గొత్తికోయలకు కనీసం తాగడానికి నీళ్ళు లేక ఎన్నో ఇబ్బందుకు గురవుతున్నారని,వాటివల్ల అనారోగ్య సమస్యలు పిడిస్తున్నాయి, కనీసం దారి మార్గం సౌకర్యం లేక కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేక ఆ ప్రాంత వాసులు అంధకారంలో మగ్గుతున్నారు. ఉన్న అంగన్వాడీకి పక్కా భవనం లేదు.ఇంకా కటిక దారిద్య్రంలో మగ్గుతున్నరు అడవి బిడ్డలు.
మండలం లోని కొత్త కావడిగుళ్ల గొత్తికోయల పాకల రహదారే కాదు విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీటి వసతి గానీ ఏమీ లేకుండా ఏళ్ళ కాలంగా అలాగే మగ్గి పోతున్నారు. అంతేకాకుండా సదరు మారుమూల ప్రాంతాలలో నివసించే గుత్తి కోయ ప్రజలు మైదాన ప్రాంతానికి రావాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రస్థాయిలో ఉండగా ఇప్పటికి ఏమైనా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు రహదారి సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
ప్రస్తుతం గొత్తికోయలకు ఓటు హక్కు కలిగి ఉండగా ఈ గ్రామాల్లోని సుమారు అత్యధికంగానే సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ ఆ ఓటును వినియోగించుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఏళ్ళ కాలం గడిచినా వారికి అందని ప్రోత్సాహంతో ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్న ఆ గొత్తికోయ గ్రామాల వైపు వెళ్ళే పోటీ అభ్యర్థులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వారి సమస్యను పరిష్కరించే విధంగా కార్యాచరణ చేసే వారికే ఓట్లు వేస్తామని ఆ గొత్తికోయ గ్రామాలు ముక్త కంఠంతో తెలుపుతున్నారు. లేదంటే ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా వెళ్ళమంటున్నారు.
Views: 13
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సామాజిక మానత్వం కోసం జమాఅత్-ఏ-ఇస్లామీ హింద్
08 Dec 2024 13:39:17
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్
Comment List