
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ 75 పైగా స్థానాల్లో గెలుస్తుంది: కర్ణాటక మంత్రి మధు బంగారప్ప...
ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి: మధు యాష్కీ గౌడ్..
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ 75 పైగా స్థానాల్లో గెలుస్తుంది: కర్ణాటక మంత్రి మధు బంగారప్ప...
ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి: మధు యాష్కీ గౌడ్

ఎల్బీనగర్, నవంబర్ 18 న్యూస్ ఇండియా తెలుగు: కొత్తపేట డివిజన్లో ఆర్టీసీ కాలనీలో లింగాల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్. ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక మంత్రివర్యులు మధు బంగారప్ప హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. కర్ణాటకలో మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసాం. అక్కడ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం ఇస్తున్నాం. ఓటమి భయంతో బిఆర్ఎస్ పార్టీ పనిగట్టుకుని మాపై దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఇక్కడ సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా వందరోజుల్లో అమలు చేస్తాం అన్నారు. ఇక్కడ మధుయాష్కీ ఎమ్మెల్యే అయితే మీరే ఎమ్మెల్యేలు అయినట్లు అన్నారు. మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల పేదల,హరిజన, గిరిజన , బహుజన, మైనారిటీ వర్గాల గొంతుకగా అసెంబ్లీలో గళం విప్పే అవకాశం ఇవ్వమని ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలను కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏంటి?, నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టాడని విమర్శించారు. పైన పటారం లోన లొటారంలాగా ఫ్లైఓవర్లు చూపిస్తూ ఇదే అభివృద్ధి అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. నియోజకవర్గంలో అడుగడుగున మురికి కాలువల సమస్య స్వాగతం పలుకుతుంది, ప్రజల కష్టాలతో కన్నీటి వరదలు కారుస్తున్నారన్నారు. మీ అభివృద్ధి నా లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి, ఓబిసి సెల్ నాయకులు కత్తి వెంకటస్వామి, ప్రచార కమిటీ కో కన్వీనర్ వజీర్ ప్రకాష్, ఆర్టీసీ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువరు యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List