జనగామ అభివృద్ధి కొమ్మూరితోనే సాధ్యం
ప్రజల ఆశీర్వాదమే కొమ్మూరి బలం
కాంగ్రెస్ గ్యారంటీలపై ఇంటింటి ప్రచారం..
నవంబర్ 22, న్యూస్ ఇండియా తెలుగు (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు మ్యాక కిష్టయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హాస్తం గుర్తు ఓటు వేసి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలు మహాలక్ష్మీ పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, యువ వికాసం గురించి వివరిస్తూ ప్రచారం జోరుగా నిర్వహించారు.ప్రజల ఆశీర్వాదమే కొమ్మూరి బలం అని,తెలంగాణ ప్రజలు కన్నటువంటి కలలు, ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ తోనే నెరవేరుతాయన్నారు.ఇందిరమ్మ రాజ్యంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
Comment List