బిఆర్ఎస్ కు బై బై... కాంగ్రెస్ కు జై జై...

బిఆర్ఎస్ కు బై బై...    కాంగ్రెస్ కు   జై జై...

IMG-20231124-WA0912
చేరిన వారికి కండువా కప్పుతున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో శుక్రవారం బి ఆర్ ఎస్ పార్టీ నుండి 150 మంది కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపరాజు పల్లి సర్పంచ్ కీసర్ల ఉపేంద్ర సత్తిరెడ్డి ఒంటెద్దు పోకడ వలనే కార్యకర్తలను పట్టించుకోకుండా అవమానిస్తున్నందున పార్టీకి రాజీనామా చేయవలసి వచ్చిందని వారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి వివరాలు సీనియర్ నాయకులు కీసర్ల మహేందర్ రెడ్డి యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి నాయకులు పాలకూర్ల అంజయ్య. పాలకూర్ల మచ్చందర్ గౌడ్ లు తెలిపారు. రేపో మాపో మరి కొంతమంది సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పులగుర్ల కొండల్ రెడ్డి, ఎనుగుల లింగయ్య,ఏనుగుల పర్వతాలు, పోలబోయిన రాములు, నల్లబోలు ధర్మేందర్, కోమటిరెడ్డి పద్మా రెడ్డి,పోలబోయిన సత్తయ్య, ఏనుగుల హనుమయ్య, పోలబోయిన నరసింహ ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి,జెల్ల నరేందర్,నీలం బాబురావు, పాలకూర్ల మల్లేశం, కోమటిరెడ్డి మల్లారెడ్డి. సంగిశెట్టి రమేష్ ,సలిగంజి పృద్వి,పోలబోయిన గోపాల్ ,ఏనుగుల విష్ణు, మంటి పెళ్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు

Views: 223
Tags:

Post Comment

Comment List

Latest News