నేనున్నానని..
మిచౌంగ్ తుపాన్ పై ఏపీలో హై అలర్ట్
ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ రివ్యూ
ఆంధ్ర ప్రదేశ్ పై మిచౌంగ్ తుపాను ప్రభావం నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అత్యవసర ఖర్చుల కోసం ప్రతి జిల్లాకు 2 కోట్లు విడుదల చేసింది.
ఇప్పటికే NDRF, SDRFటీమ్స్ ను రంగంలోకి దించాయి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదని.. సౌకర్యాల విషయంలో రాజీపడకూడదని సీఎం ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, అటు పండించిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం చాలా కీలకం అని అన్ని రకాలుగా రైతులకు అండగా ఉండాలని అన్నారు. గాలి, వర్షం కారణంగా గుడిసెలు దెబ్బతిన్నట్లయితే వెంటనే వారికి రూ.10,000 అందించాలన్నారు. బాధితుల పట్ల దయతో వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List