డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు

By Ramesh
On
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

డా. బి .ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ భారత, భారత రత్న డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఫలాలు అందరికి అందిన రోజే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని అన్నారు.భారత దేశంలో స్వాతంత్ర్యనికి పూర్వం వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురైనా అణగారిన వర్గాల వారికి భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిగా ,రాజకీయ న్యాయం చేసిన మహనీయుడు డా బి ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన రాజ్యంగం ద్వారా కల్పించిన హక్కులు ఫలాలు అర్హులైన వారికి అందేలా అందరు భాగస్వాములు అయ్యి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అప్పుడే అంబేద్కర్ ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ యువ జన సమితి జిల్లా అధ్యక్షుడు పాండు, మల్లేష్ నాయకులు శశికాంత్, సాయి వరాల, రాము, తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

స్థానిక యుద్దానికి మేం సిద్ధం  స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన