ఉద్యమకారుడు కుమార్తెకు ఆర్థిక చేయూత

మానవత్వం చాటుకుంటున్న "జాంబవవారసులం" గ్రూపు సభ్యులు

On
ఉద్యమకారుడు కుమార్తెకు ఆర్థిక చేయూత

దళితరత్న గద్దల చంద్రయ్య

ఖమ్మం, డిసెంబర్ 14 : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమకారుడు, సామాజిక సేవా దృక్పథం కలిగిన మందుల ప్రభాకర్ మాదిగ ఇటీవల అనారోగ్యం కారణంగా పరమవదిస్తే ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతూ చదువుకుంటున్న ఆయన పెద్ద కుమార్తె మందుల మాధురికి ఖమ్మం "జాంబవవారసులం" గ్రూప్ సభ్యులు ఆర్థిక చేయూతతో ఆదుకోవడం అభినందనీయం. గురువారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని అడవిమద్దులపల్లి గ్రామంలోని ఉద్యమకారుడు మందుల ప్రభాకర్ ఇంటికి జాంబవవారుసులం గ్రూపు సభ్యులు వెళ్లి హర్యానాలోని గురు గ్రామ్ లో ఎస్ జి టి కళాశాలలో అనస్తీసియా మొదటి సంవత్సరం చదువుతున్న మందుల మాధురికి 28 వేల రూపాయలను దళిత రత్న గద్దల చంద్రయ్య, మడుపల్లి బాబు చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దల చంద్రయ్య మాట్లాడుతూ.. జాంబవవారుసులం గ్రూపు సభ్యులు... పేదరికంలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉండి చదువుకుంటున్న ఎంతోమంది విద్యార్థులకు, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా అండగా ఉంటూ ఆర్థికసాయంతో ఆదుకుంటున్న గ్రూపు సభ్యులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలిమల రమేష్ బాబు, కోపూరి సుభాష్, పేరెల్లి శ్రీను, మరికంటి కన్నారావు, కేదాస్ కృష్ణ, ఆరెంపుల అంబేద్కర్, కేదాస్ కిరణ్, మందుల ఉపేందర్, యడెల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Views: 14
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News