ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్ ఎస్పీ

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

On

టికెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయం

 భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 17:ముక్కోటి మహోత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఆదివారం దేవాలయం వద్ద ముక్కోటి మహోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాచలం విచ్చేయభక్తుల సౌకర్యార్థం టికెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు చెప్పారు. భక్తులు వచ్చినట్లు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆమె సూచించారు. 22న గోదావరిలో జరిగే స్వామి వారి తెప్పోత్సవం, 23న జరుగు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్టార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి సెక్టారులో ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్లపైకి వచ్చిన దుకాణాలను తొలగించాలని ఆమె సూచించారు. అనంతరం సెక్టారులను పరిశీలించి దేవస్థానం అధికారులకు తగు సూచనలు చేశారు.ఎస్పీ డాక్టర్ వినిత్ మాట్లాడుతూ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఒక గంట ముందుగానే వారికి కేటాయించిన సెక్టారులకు చేరుకోవాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రెండు రోజులు పాటు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని భక్తులు గమనించి అధికారి యాత్రంగానికి సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రమాదేవి, ఆలయ ప్రధాన అర్చకులు సీతారామనుజాచార్యులు, ఆర్డిఓ మంగీలాల్, మండల ప్రత్యేక అధికారి నాగలక్ష్మీ,  ఇరిగేషన్ ఈ ఈ రాంప్రసాద్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 42

About The Author

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు