పెదపాటి అమ్మాజీకి భారీగా స్థానిక యువత మద్దతు
అడ్డరోడ్డులోని అమ్మాజీ నివాసంలో యువత భేటీ
స్థానిక నాయకురాలు అమ్మాజీకి సంపూర్ణ మద్దతు.. పాయకరావుపేటలో వైసీపీదే మళ్లీ గెలుపు
పాయకరావుపేట న్యూస్: (డిసెంబర్ 19): పాయకరావుపేట నియోజకవర్గంలో రాజకీయ చిత్రం మారుతోంది. ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకి భారీగా మద్దతు పెరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీ హై కమాండ్ అమ్మాజీని బరిలోకి దింపేందుకు వ్యూహరచన చేస్తోంది. దీంతో పాయకరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. నియోజకవర్గం యువత.. అడ్డరోడ్డులోని అమ్మాజీ నివాసానికి వచ్చి అమ్మాజీకి తమ మద్దతు తెలిపాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అమ్మాజీ అభ్యర్ధిత్వంతో వైసీపీ భారీ విజయాన్ని పొందుతుందని ఈ సందర్భంగా యువత పేర్కొంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List