*దాతల సహకారంతో దుప్పట్లు, స్టడీ మెటీరియల్ పంపిణీ*
*వెంకటాపురం సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండ యాకన్న గౌడ్.*
*తొర్రూరు మండలం, వెంకటాపురం గ్రామంలో సోమవారం రోజున వెంకటాపురం సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండ యాకన్న గారి ఆధ్వర్యంలో వెంకటాపురం సేవా ట్రస్ట్ కు ప్రతినెల దాతలు అందిస్తున్న సహకారంతో గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండ యాకన్న గౌడ్ మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో గత ఐదు సంవత్సరాల పైగా దాతల సహకారంతో సేవా ట్రస్ట్ ద్వారా చాలా కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడం, నిత్యవసర వస్తువుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిరంతరం గ్రామంలో చేయడం జరుగుతుంది. అందుకు సహకరిస్తున్న దాతలందరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తు, ఇక ముందు కూడా దాతల సహకారంతో గ్రామంలోని నిరుపేద కుటుంబలను ఆదుకోవడమే వెంకటాపురం సేవ ట్రస్ట్ లక్ష్యంగా పని చేస్తామని తెలియజేశారు.*
*ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బొలగాని శ్రీనివాస్ గౌడ్ , కొండ ఉప్పమ్మ, యువకులు, మహిళలు పాల్గొన్నారు.*
Comment List