కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన కొండా వర్సెస్ పల్లా

ఇద్దరి మధ్య వాగ్వాదం

By Venkat
On
కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన కొండా వర్సెస్ పల్లా

మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో సిద్దిపేట హరిత హోటల్లో జరిగిన సమీక్ష సమావేశం నుంచి రాజేశ్వర్ రెడ్డి ఉన్నట్టుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులను స్టేజి మీదకు పిలిచే విషయంలో.. మంత్రి ప్రోటోకాల్ ఉల్లంఘించిందని ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సమీక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయాలకు, ఆచార కట్టుబాట్లకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారనన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వారిని కూడా స్టేజీ మీదికి పిలవడం చాలా దురదృష్టకరమని చెప్పారు.

మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశాన్ని హోటల్లో పెట్టలేదన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా వెళ్లిపొమ్మనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తమ హయాంలో ఇలా ఎప్పుడూ రాజకీయాలను ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారుWhatsApp-Image-2023-12-30-at-18.29.58-696x361

Views: 30
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు 27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) జనవరి 19: కొత్తగూడెం  కార్పొరేట్ పరిధిలోని 27 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల సుధారాణి తన దరఖాస్తును  భద్రాద్రి కొత్తగూడెం...
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత 
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..