ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించి ప్రమోషన్లు కల్పించాలి

పి ఆర్ టి యు టీస్ టి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

By Venkat
On
ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించి ప్రమోషన్లు కల్పించాలి

పి ఆర్ టి యు టీస్ టి ఎస్ పాలకుర్తి మండల

పి ఆర్ టి యు టీస్ టి ఎస్ పాలకుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో పి ఆర్ టి యు టీస్ టి ఎస్-2024 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మండల విద్యావనరుల కేంద్రం పాలకుర్తి లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి హాజరైన జెడ్ పి హెచ్ ఎస్ పాలకుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పాయం శోభ రాణి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసి సాధించే సంఘం ఒక పిఆర్టియు మాత్రమే తెలిపారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మన ఉపాధ్యయులకు సమస్యలు లేకుండా పి ఆర్ టి యు చేయాలని తెలిపారు.పిఆర్టిఎస్ పాలకుర్తి మండల శాఖ అధ్యక్షుడు శ్రీ బైకాని వెంకన్న  మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం పి ఆర్ టి యు టీస్ మాత్రమే కృషి చేయగలదని తెలుపుతూ, ఉపాధ్యాయులకు బదిలీ ప్రమోషన్లు అతి త్వరలో చేయాలని మరియు ఉపాధ్యాయులకు ప్రధాన అడ్డంకిగా ఉన్న  టెట్ నుంచి మినహాయింపు ఇచ్చి  ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎస్ ఉద్యోగస్తులకు  పాత పెన్షన్ ఇవ్వాలని కోరారు. పాఠశాలల్లో బోధనా కార్యక్రమాలకు విఘతం కలిగిస్తున్న  ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నతి కార్యక్రమాలను సమీక్షించి వాటిని రద్దు చేసే విధంగా చూడాలని  ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి ఎస్ పాలకుర్తి మండల శాఖ ప్రధాన కార్యదర్శి  వడ్లకొండ శ్రీనివాస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు  G.సురేందర్ రెడ్డి,K. సోమయ్య, శ్రీనివాస్ గుప్తా,గార్లు, రాష్ట్ర కార్యదర్శులు  P. రాజిరెడ్డి, సరిత గార్లు  మండల అసోసియేట్ అధ్యక్షులు K.రామానుజన్, మండల కార్యదర్శి P.విజయ్ కుమార్, మండల మహిళా కార్యదర్శి M.శోభారాణి, మరియు ఉపాధ్యాయులు A. నరసింహమూర్తి  O. రమేష్,శ్రీనివాస రావు, కృష్ణయ్య, శ్యాంసుందర్,మురళి, ఆంజనేయులు, శ్రీనివాస్ తిరుమల దేవి, ప్రతిభ లీలా రాణి,తదితరులు పాల్గొన్నారు.IMG-20240108-WA0213

Views: 39
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..