కష్టకాలంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) ద్వారా ఉచిత రక్త దానం
On
గిద్దలూరు న్యూస్ ఇండియా
కర్నూల్ జిల్లా నంద్యాలలో మాణిక్యమ్మ (35) అనే మహిళ అనారోగ్యంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే మాణిక్యమ్మ(35) కి రక్తం తక్కువగా ఉన్నదని వైద్యులు తెలిపారు. మాణిక్యమ్మ బ్లడ్ బి - పాజిటివ్ కొరకు ఎదురుచూస్తున్న తరుణంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) ఫౌండర్ విజయ్ తమ అసోసియేషన్ తరపున ఉచితంగా రక్తం ఏర్పాటు చేశారు.నంద్యాల బ్రాంచ్ నుండి విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ ) సభ్యుడు ఆర్.నగేష్ తక్షణమే స్పందించి మాణిక్యమ్మ కి రక్త దానం చేశారు.కనుక ఆర్.నగేష్ ని విజయ్ బ్లడ్ బ్యాంక్ స్థాపకుడు విజయ్ కుమార్ అభినందించారు.సాయం పొందిన మహిళ మాణిక్యమ్మ విజయ్ బ్లడ్ బ్యాంక్ స్థాపకుడు విజయ్ కుమార్, రక్త దాత ఆర్.నగేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో ఈ అసోసియేషన్ ఎంతో ఉన్నత స్థానాలను చేరుకుని, ఎంతో మందికి ఉపయోగ పడాలని కోరారు.
Views: 205
About The Author
Post Comment
Latest News
28 Nov 2025 17:57:27
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...

Comment List