సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరన

జర్నలిస్ట్ డైరీని ఆవిష్కరించిన మంత్రి దామోదర రాజనరసింహ మరియు జిల్లా కలెక్టర్ క్రాంతి

By Ramesh
On
సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరన

IMG-20240123-WA0016సంగారెడ్డి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రూపొందించిన 2024 నూతన డైరీని మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అయన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, జర్నలిస్ట్ సమస్యల పట్ల సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సాయినాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కు నూతన సంవత్సర డైరీను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ డైరీలో ఎంతో విలువైన సమాచారం అందించారని, అందుకు అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు ప్రజోపయోగకరమైన అంశాలపై సూచనలు, సలహాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సాయినాథ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి నాగభూషణం, అసోసియేషన్ సభ్యులు ఎర్ర వీరేందర్ గౌడ్, సునీల్, పుండరీకం, రాజేష్, ఆంజనేయులు, నర్సింలు, బక్కప్ప, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 30
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.