ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువేయడంలో పత్రికల పాత్ర కీలకం

By Khasim
On
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువేయడంలో పత్రికల పాత్ర కీలకం

న్యూస్ ఇండియా యర్రగొండపాలెం:IMG-20240127-WA1459(1)

ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధి పత్రికలని ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువేయడంలో పత్రికల పాత్ర కీలకమని తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం లో న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక 2024 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైంది అన్నారు.వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఏ అధికారి గాని రాజకీయ నేతలకు గాని భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేలపై ఉందన్నారు. ప్రజలకు బలం పత్రికలని అన్నారు. అందుకే ప్రజల పక్షాన నిలిచే ‘న్యూస్ ఇండియా ’ పత్రిక ప్రజలకు అన్నివేళలా అండగా ఉండగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ న్యూస్ ఇండియా దినపత్రిక మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ నాయకులు హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ పత్రికలు లేకుండా నేటి సమాజంలో ప్రజల మనుగడ అసాధ్యం అన్నారు.పత్రికలు గాని మీడియా కానీ ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తూ చైతన్య పరచడంలో వాటికవే సాటి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోప్పర్తి ఓబుల రెడ్డి, సచివాలయ కన్వీనర్ షేక్ జబీవుల్లా, ఒంగోలు సుబ్బారెడ్డి, కృష్ణ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 56
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్