ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్‌ జడ్జిగా - తెలంగాణ యువతి

తెలంగాణ, జనవరి28, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్‌ జడ్జిగా - తెలంగాణ యువతి

ఏపీ జూనియర్ సివిల్‌ జడ్జిగా తెలంగాణ యువతి అలేఖ్య ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్‌ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. పరీక్ష ఫలితాల్లో తెలంగాణ యువతి అలేఖ్య(24) ఫస్ట్ ర్యాంకు సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు.

IMG-20240128-WA0023

హన్మకొండ కు చెందిన మాధవీలత, పరిమి మనోజ్‌ కుమార్‌ దంపతుల కుమార్తె అలేఖ్య హైదరాబాద్‌ పెండేకంటి కాలేజీలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న తల్లి మాధవీలతను స్ఫూర్తిగా తీసుకుని తానూ జడ్జి కావాలనుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నియామకాల్లో ఫస్ట్ ర్యాంకులో నిలిచి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్‌, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల మాధవరెడ్డి అభినందించారు. అలేఖ్య ఇంకెన్నో విజయాలను సాధించాలని కోరుకుందాం మరి.

Views: 29
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు