బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన - మెండోరా ఎంపీటీసీ..!

- త్వరలో బీజేపీలో చేరేందుకు కసరత్తు..

On
బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన - మెండోరా ఎంపీటీసీ..!

న్యూస్ ఇండియా ప్రతినిధి - నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా భింగల్ మండలం మెండోరా ఎంపీటీసీ అధికార బీఆర్ ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చింది. భింగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన ఎంపీటీసీ అరె రవీందర్ లావణ్య బీఆర్ఎస్ పార్టీకి సోమవారం రాజీనామా చేస్తున్నట్లు తన ఫేసుబుక్ లో  ప్రకటించారు.IMG_20240129_172911

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ యస్ పార్టీని విడుతున్నట్లు తెలిపారు. ఇన్ని రోజుల వరకు  మెండోరా, దేవన్ పల్లె గ్రామాల అభివృద్ధికి తనఆత్మీయులకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా  అన్ని విధాలుగా సహకరించిన బీఆర్ యస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు  బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి, వేముల అజయ్ రెడ్డికి,భీంగల్ ఎంపీపీకి, జడ్పీటీసీ కి పార్టీ మండల అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాన్నన్నారు. ఇది ఇలా ఉండగా అరె రవీందర్ లావణ్య బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకొనునట్లు విశ్వసనీయ సమాచారం.

Views: 367
Tags:

About The Author

Post Comment

Comment List