శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో టేక్మాల్ లో ఉచిత వైద్య శిబిరం

On
శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో టేక్మాల్ లో ఉచిత వైద్య శిబిరం

 టేక్మాల్ రిపోర్టర్ జైపాల్ : రిపోర్టర్ జైపాల్ ఫిబ్రవరి 10 మెదక్ జిల్లా పాపన్నపేట శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం టేక్మాల్ మండల కేంద్రంలోని గాంధీ భవన్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పాపన్న పేటలో గత రెండు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్  రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన వైద్య శిబిరానికి కంటి, ఆర్థోపెడిక్ (ఎముకల) వైద్యనిపునులు హాజరై ఉచితంగా పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సాయికిరణ్, వెంకటేశ్వర హాస్పిటల్ యాజమాన్యం వెంకటేష్ గౌడ్, విట్టలేశ్వర్, రవీందర్, నవీన్, సుమన్, శంకర కంటి ఆసుపత్రి ప్రశాంత్ రెడ్డి, టేక్మాల్ మండల నాయకులు రమేష్, వీరప్ప, భాస్కర్, కిషోర్, రాజేశ్వర్, భాగయ్యలు తదితరులు పాల్గొన్నారు

Views: 40

About The Author

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు