కేసీఆర్‌ వ్యాఖ్యలపై తుమ్మల ఆగ్రహం...

నల్గొండలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

On
కేసీఆర్‌ వ్యాఖ్యలపై తుమ్మల ఆగ్రహం...

కెసిఆర్ కు ప్రజాస్వామ్యం పై నమ్మకం లేదు...

*కేసీఆర్‌ వ్యాఖ్యలపై తుమ్మల ఆగ్రహం....*
-------------------------------------------
నల్గొండలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

1...కెసిఆర్ కు ప్రజాస్వామ్యం పై నమ్మకం లేదు...

2...ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అంగీకరించడానికి మాత్రం సిద్ధంగా లేరు..

3… ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ప్రజల తీర్పును అందరం గౌరవించాలి. కానీ కేసిఆర్ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.

Read More ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

4…నాకు ఓటేసినంత కాలం ప్రజలు తెలివైనవారు, నాకు వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రం పజలు మూర్ఖులన్నట్టు కెసిఆర్ మాట్లాడుతున్నారు.

Read More నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!

5.....పాలు ఇచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును ఎన్నుకున్నారు అంటూ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవించక పోగా ప్రజలను చులకన చేసి మాట్లాడడం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం..

Read More జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

6…. ఇంతటి రాజకీయ అనుభవమున్న కేసిఆర్ ఒక్క ఓటమితోనే ఓటర్ల విజ్ఞతను శంకిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగని మాటలవి.

7....కృష్ణ గోదావరి నదులపై తెలంగాణ వాటాను వదులుకున్నది కేసిఆర్. పదేళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రానికి న్యాయం చేయకపోగా నాశనం చేసిన చరిత్ర మీది.

8..కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో జరిగింది అవినీతి కాక ఏమిటి ? మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగితే కేసీఆర్ కు కనీసం బాధ్యత, బాధ ఉన్నట్లు కనపడకపోవడం విచారకరం. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయితే ఏమి పికనీయ పోయారు అంటూ కేసీఆర్ మాట్లాడడం ఎంత బాధ్యతారాహిత్యం ?

9. నల్లగొండకు పోయే ఓపికుంది కానీ ఇంటిపక్కనున్న అసెంబ్లీకి మాత్రం రారు. ప్రజలెన్నుకున్న సభలో ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పేధైర్యం లేకనే శాసన సభకు రావడం లేదు 

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News