ఉనికి

On

మిత్రమా నేను నీ తెలుగును అప్పుడే మర్చిపోయారా ఈ రోజు మీ విద్యాలయం లో సభ జరిగిందట కదా నేను ఒక్కసారైనా జ్ఞప్తికి వచ్చానా లేదు కదా నన్ను ఒక అంటరానిదానిలా ఒక అన్యదేశ వస్తువులా పక్కకు నెట్టేశారు కదా అవునులే అంతేలే నేను నీకు ఏమవుతాను చిన్నప్పుడు నీ మాటలకు నీ భావాలకు ఒక రూపాన్నిచ్చి మంచి బాలలుగా తీర్చిదిద్దాను యవ్వనంలో నీకు నైతిక విలువలను బోధించాను ఇప్పుడు నేను నీకు పరాయినయ్యా నేను నీకు […]

మిత్రమా
నేను నీ తెలుగును
అప్పుడే మర్చిపోయారా
ఈ రోజు మీ విద్యాలయం లో సభ జరిగిందట కదా
నేను ఒక్కసారైనా
జ్ఞప్తికి వచ్చానా
లేదు కదా
నన్ను ఒక అంటరానిదానిలా
ఒక అన్యదేశ వస్తువులా
పక్కకు నెట్టేశారు కదా
అవునులే
అంతేలే
నేను నీకు ఏమవుతాను
చిన్నప్పుడు నీ మాటలకు
నీ భావాలకు ఒక రూపాన్నిచ్చి
మంచి బాలలుగా తీర్చిదిద్దాను
యవ్వనంలో నీకు
నైతిక విలువలను బోధించాను
ఇప్పుడు నేను నీకు
పరాయినయ్యా
నేను నీకు పరాయిని కాదు
నేనంటే నువ్వే నువ్వంటే నేను
నీలో ఉన్న నా అస్థిత్వాన్ని
నీలో ఉన్న నా ఉనికిని
పోగొట్టుకున్నావా మిత్రమా
అంటే నిన్ను నువ్వే పోగొట్టుకున్నవా
నేటికయినా నన్ను గుర్తిస్తావు కదూ

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి