మహిళలకు దక్కని భద్రత•మహిళా ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు

అంతా తెలిసిన అధికారులు..కామూష్.. •ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు... •తొర్రూర్ పిఎసిఎస్ లో ఘటన

మహిళలకు దక్కని భద్రత•మహిళా ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు

1712397209813 ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు అందుబాటులోకి తెచ్చిన మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. అన్ని రంగాల్లో ధీటుగా రాణిస్తున్న మహిళలకు తోటి ఉద్యోగుల నుంచే లైంగిక వేధింపులు అధికమవుతున్నాయి.భారతదేశానికి వెన్నుముక రైతన్న అని చెప్పుకుంటున్న మన దేశంలో అలాంటి రైతన్నకు కష్టమొస్తే ఆదుకోవలసిన రైతు క్షేత్రంలో మహిళలకు దక్కని భద్రత...అలాంటి క్షేత్రంలో పనిచేస్తున్న ఒక్క మహిళ లైంగికంగా వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. ఇలాంటి అమానుష ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చోటు చేసుకుంది....వివరోల్లికి వెళ్తే......తొర్రూరు పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరుపతి సంఘంలో ఒక్క మహిళ పనిచేస్తుండగా అదే తొర్రూరు పిఎసిఎస్ సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వేధింపులు చేస్తున్నారని మహిళ.... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.గత కొన్ని రోజులుగా సదరు మహిళ పై మనసు పడ్డ మురళి తాజాగా వేధింపులు ఎక్కవావడంతో వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది.

*మురళిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు*

మహిళ వేధింపు విషయంలో వెలుగు మురళి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తొర్రూర్ ఎస్సై జగదీష్ బాబు తెలిపారు.మురళి పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి డిఎస్పీకి పంపించినట్లు జగదీష్ బాబు తెలిపారు. తదుపరి విషయంలో డిఎస్పి సురేష్ గారు విచారణ చేపడతారని తెలిపారు.

Views: 181
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News