రూ. లక్ష లంచం డిమాండ్

అవినీతి శాఖకు చిక్కిన మాదాపూర్ ఎస్ఐ

By Venkat
On
రూ. లక్ష లంచం డిమాండ్

స్టేషన్‌ రైటర్‌ విక్రమ్‌,ఎస్ఐ

హైదరాబాద్‌ : లంచం తీసుకుంటూ మాదాపూర్‌ ఎస్సై రంజిత్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఈ కేసులో స్టేషన్‌ రైటర్‌ విక్రమ్‌ను కూడా అనిశా అధికారులు విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌ సాయినగర్‌లో లక్ష్మణ్‌ నాయక్‌ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే, తన స్థలంలో ఇల్లు కడుతున్నాడంటూ ఆయనపై సుధ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రంజిత్‌.ఆయన్ని పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఫోన్‌ చేశారు.రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.తన స్థలంలో ఇల్లు కట్టుకుంటే డబ్బులెందుకు ఇవ్వాలని లక్ష్మణ్‌ ఎదురు ప్రశ్నించారు.ఇవ్వకపోతే కూతురు, అల్లుడిపై కేసు నమోదు చేస్తామని ఆయన్ని బెదిరించారు. రూ.20 వేలు మాత్రమే ఇస్తానని చెప్పిన లక్ష్మణ్‌..  ఇదే విషయంపై అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిపై నిఘా ఉంచిన అనిశా లక్ష్మణ్‌ డబ్బులిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.IMG_20240407_131841

Views: 55
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌...
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్
మేడారానికి 25 నుంచి ప్రత్యేక బస్సులు
కార్పొరేషన్ ఎన్నికల ప్రచారజోరు పెంచిన సిపిఐ
ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం
27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత