•అధికార అహంతో కాంగ్రెస్ నేతల దాడులు సిగ్గుచేటు.. •చర్యలు తీసుకొని యెడల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపడతాం...
•మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
•అధికార అహంతో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల కార్యకర్తలపై దాడులకు తెగబడటం సిగ్గు చేటని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
•మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన రైతు,బిఆర్ఎస్ కార్యకర్త ఎండి అక్బర్ పై మడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నం సోమిరెడ్డి తో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులు చేయడం వలన తీవ్రంగా గాయపడటంతో విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు హుటాహుటిన తొర్రూరు డివిజన్ కేంద్రంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అక్బర్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
•మడిపల్లి గ్రామానికి చెందిన రైతు టిఆర్ఎస్ కార్యకర్త అక్బర్ ప్రభుత్వ చెరువు కుంట నుండి మొరం మట్టిని తన వ్యవసాయ భూమిలో పోసుకుంటే ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, వెంకటేశ్వర్లు లు ప్రభుత్వ కుంటలో మొహరంను తీసుకుపోవాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని భౌతిక దాడులు చేసి గాయపరచడం బాధాకరమన్నారు.
•బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడ ఎలాంటి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడలేదని వాపోయారు. అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజురోజు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
•జిల్లా ఎస్పీ, డీఎస్పీలు స్పందించి విచారణ చేపట్టి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
Comment List