గుడుంబా స్థావరాలపై దాడులు
ఒకేసారి నాలుగు మండలాలలో 8 టీంలు..
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా ప్రాంతాలలో ఎక్సైజ్ పోలీసులు గుడుంబా స్థావరాలపై ముమ్మరంగా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు,ఎన్‌ఫోర్స్‌మెంట్ వరంగల్,మరియు ఎస్‌టీఎఫ్ టీమ్ హైదరాబాద్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ వరంగల్, డీటీఎఫ్ టీమ్ తో తొర్రూరు అబ్కారీ పోలీసులు కలిసి గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించామని డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు తెలిపారు.తొర్రూరు అబ్కారీ స్టేషన్ పరిధిలోని నాలుగు మండలాలలో ఎనమిది టీములుగా విడిపోయి దాడులు నిర్వహించామ్మనారు. తొర్రూర్ పెద్దవంగర నరసింహుల పేట దంతాలపల్లి మండలాలలో గుడుంబా స్థావరాలను గుర్తించి గుడుంబా నిల్వలను ధ్వంసం చేసామన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గుడారాలను కూల్చివేశామని,గుడుంబా స్థావరాలలో,పలు వీధుల్లోని ఇళ్లలో తనిఖీ చేశామని,పలు ప్రాంతాల్లో డ్రమ్ముల్లో నిల్వ చేసిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు తెలిపారు.అనుమానితుల నుంచి నాటు సారను, నల్ల బెల్లం,మరియు పటికను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గుడుంబా తయారీకి ఉపయోగించే వస్తువులు, పాత్రలను ధ్వంసం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ ఎస్ హెచ్ ఓ ప్రవీణ్ ఎస్ఐలు తిరుపతి అనిల్ మరియు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
Comment List