మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

On
మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

మధుయాష్కి గౌడ్ కు

IMG-20240505-WA0119
మధుయాష్కి కారు ప్రమాదం జరిగిన దృశ్యం..

తృటిలో తప్పిన ప్రమాదం..

ఎల్బీనగర్, మే 05 (న్యూస్ ఇండియా ప్రతినిధి): టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. అనుకోకుండా అడ్డువచ్చిన  బైకును తప్పించే క్రమంలో.. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు గురైనప్పటికీ.. డ్రైవర్ ముఖేష్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ తల్లి మరణించడంతో.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు  ఆదివారం ఉదయమే మధుయాష్కి గౌడ్ గారు  వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో ఆలేరు వద్దకు వెళ్ళగానే బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనుకోకుండా  అడ్డుగా వచ్చారు. బైక్ పై ఉన్న ఆ వ్యక్తులను కాపాడే క్రమంలో.. కారును డ్రైవర్ పక్కకు తిప్పగా  డివైడర్ను ఢీ కొట్టి కారు టైర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో  మధుయాష్కి గౌడ్, కారులోని ఇతరులకు స్వల్ప గాయాలు మినహా ప్రాణాపాయం తప్పడంతో .. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 'దేవుడి దయవల్ల స్వల్ప గాయాలు మినహా  ఎవరికి ఏమి కాలేదు ' అని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.

Views: 11

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన* కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
జై శ్రీమన్నారాయణ,వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీకొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల...
కన్నడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో   *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!
నూతన ఎస్సై ని సన్మానించిన ఇమామ్ సాబ్ లు‌‌..
ఘనంగా HRCCI తెలంగాణ రాష్ట్ర సదస్సు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...
పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!