మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

On
మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

మధుయాష్కి గౌడ్ కు

IMG-20240505-WA0119
మధుయాష్కి కారు ప్రమాదం జరిగిన దృశ్యం..

తృటిలో తప్పిన ప్రమాదం..

ఎల్బీనగర్, మే 05 (న్యూస్ ఇండియా ప్రతినిధి): టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. అనుకోకుండా అడ్డువచ్చిన  బైకును తప్పించే క్రమంలో.. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు గురైనప్పటికీ.. డ్రైవర్ ముఖేష్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ తల్లి మరణించడంతో.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు  ఆదివారం ఉదయమే మధుయాష్కి గౌడ్ గారు  వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో ఆలేరు వద్దకు వెళ్ళగానే బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనుకోకుండా  అడ్డుగా వచ్చారు. బైక్ పై ఉన్న ఆ వ్యక్తులను కాపాడే క్రమంలో.. కారును డ్రైవర్ పక్కకు తిప్పగా  డివైడర్ను ఢీ కొట్టి కారు టైర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో  మధుయాష్కి గౌడ్, కారులోని ఇతరులకు స్వల్ప గాయాలు మినహా ప్రాణాపాయం తప్పడంతో .. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 'దేవుడి దయవల్ల స్వల్ప గాయాలు మినహా  ఎవరికి ఏమి కాలేదు ' అని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.

Views: 12

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు