తప్పుడు ధ్రువ పత్రాలతో పీఈటి ఉద్యోగం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పిఈ టిగా విధులు
విధుల నుండి తొలగించాలని తుడుం దెబ్బ డిమాండ్
తప్పుడు ధ్రువ పత్రాలతో పీఈటి ఉద్యోగం.
*కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పిఈ
టిగా విధులు.
*13 సంవత్సరాలు గా జాటోత్ రజిత విధులు.
*విధుల నుండి తొలగించాలని తుడుం దెబ్బ డిమాండ్.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉద్యోగి తప్పుడు దృవపత్రాలతో పీఈటి గా గత 13 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నదని పత్రికా ప్రకటనలో మహబూబాబాద్ జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షులు బొల్లి సారయ్య ఆరోపించారు. గూడూరు మండలం బ్రాహ్మణ పెళ్లి గ్రామంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఉన్నది. అయితే గతంలో కస్తూరిబాలో ఉపాధ్యాయులను, పీఈటీ ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. సరైన విద్యా అర్హతలు, పత్రాలు లేకుండా 13 సంవత్సరాల నుండి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పీఈటిగా ఉద్యోగం చేస్తూ అందర్నీ నమ్మించి ప్రభుత్వ సొమ్మును కాజేసిందని తుడుందెబ్బ ఆరోపిస్తూ ఉద్యోగం చేయాలంటే వయసు కూడా సరిపోవాలని, ప్రభుత్వాలను మోసం చేస్తూ వస్తున్నదని, గత 13 సంవత్సరాల క్రితం జాటోత్ రజితకు సరైన వయసు లేదని ఆమె సరైన పత్రాలు కూడా తన దగ్గర లేవని తప్పుడు పత్రాలు సృష్టించి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్యోగం సంపాదించిందని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య తుడుం దెబ్బ సమావేశంలో ఆమెపై ఆరోపణలు చేశారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి జాటోతు రజిత ను వెంటనే విధుల్లో నుండి తొలగించి చదువులో రాణించిన వారికి ఉద్యోగం కల్పించాలని, జాటోత్ రజిత ను తొలగించని ఎడల తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తుడుందెబ్బ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు పట్టుదలతో కృషితో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపల్ సునీతకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు బోల్లి సారయ్య, నాయకులు బత్తుల రామన్న, పూనేం యాకయ్య, ఈసం గణేష్, పూనేం మునేందర్, పూనేం చిన్న వీరస్వామి, పోనేం సురేష్, ఆగబోయిన చంద్రం, పునేం లోకేష్, రాజు, సాయి, వరుణ్ లు పాల్గొన్నారు.
Comment List