ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - టిడిపి నాయకులు

By Khasim
On

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలు ఉద్యోగస్తులు కావున విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలుగుదేశం నాయకులు నాగరాజు గౌడ్, దేశాయి మాధవరావు దేశాయి,దేశాయి గురు రాజారావు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పావతి లు తెలిపారు. గురువారం మండల కేంద్రమైన నందవరం వెలుగు సిబ్బంది నందవరం మండల తెలుగుదేశం నాయకులు దేశాయి గురు రాజారావు, దేశాయి మాధవరావు, నాగరాజ్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పావతి లను కలిసి బొక్కెన, శాలువా పూలమాలలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు సిబ్బంది సమస్యలు ఉన్నయెడల తమ దృష్టికి తెస్తే తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దేశాయి మాధవరావు, దేశాయి గురు రాజారావు ,నాగరాజ్ గౌడ్ ,జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పవతి, వెలుగు సిబ్బంది అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ చిన్న వీరన్న, సీసీలు జనార్ధన్, షబానా ,గ్రామైక్య సంఘ సహాయకులు( వి ఓ ఏ) శారదా దేవి, ఆనందు, భాగ్యమ్మ ,ఆదిలక్ష్మి ,సురేష్ త్రివేణి, గాయత్రి, నాగరత్నమ్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు 27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) జనవరి 19: కొత్తగూడెం  కార్పొరేట్ పరిధిలోని 27 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల సుధారాణి తన దరఖాస్తును  భద్రాద్రి కొత్తగూడెం...
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత 
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..