కేజీబీవీ లలో సీట్లు పెంచి బాలికల విద్యను ప్రోత్సహించండి: పి.డి.ఎస్.యు

By Khasim
On
కేజీబీవీ లలో సీట్లు పెంచి బాలికల విద్యను ప్రోత్సహించండి: పి.డి.ఎస్.యు

కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ లలో హాస్టల్ సీట్లు పెంచి బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర బాబు, జిల్లా అధ్యక్షులు అఖండ డిమాండ్ చేశారు గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో డిఆర్ఓ మధుసూదన్ రావు కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి మహేంద్ర బాబు, జిల్లా అధ్యక్షులు అఖండ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా కరువు జిల్లా గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడి ప్రాంత ప్రజలు నిత్యం బాలికలను హాస్టళ్ళలో వదిలి వలసలకు పోతున్నారని, అయితే హాస్టళ్లలో అమ్మాయిలకు సీట్లు లేకపోవడంతో వారిని వలసలకు తీసుకెళ్లిపోతున్నారన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి సీట్లు పెంచాలని కోరుతున్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు.అమ్మాయిల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కేజీబీవీ లలో ప్రవేశం కల్పించాలని పి.డి.ఎస్.యు గా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు, అలాగే సీట్లు పెంచకపోతే అమ్మాయిల తల్లితండ్రులను కలుపుకొని పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో పి.డి.యస్.యు జిల్లా నాయకులు ఆలూరు మునిస్వామి, రసూల్, జగన్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.IMG-20240620-WA2144

Views: 12
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.