భార్యాభర్తల మనస్పర్ధలు కారణంగా ఇంట్లో హాస్పిటల్ అని చెప్పి తిరిగి రాలేదు..

On
భార్యాభర్తల మనస్పర్ధలు కారణంగా ఇంట్లో హాస్పిటల్ అని చెప్పి తిరిగి రాలేదు..

IMG-20240623-WA0012న్యూస్ఇండియా తెలుగు, జూన్ 23 (నల్గొండ జిల్లా ప్రతినిధి,బెల్లి శంకర్) సాధారణంగా భార్య భర్తల మధ్య చిన్న చిన్న కారణాలవల్ల ఎంతోమంది దూరమవుతున్నారు, అదే తరుణంలో ఇక్కడ జరిగింది ఇంట్లో హాస్పిటల్ కి అని చెప్పి తిరిగి రాలేదు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లి బండ గ్రామానికి చెందిన చింత లక్ష్మమ్మ వయసు( 53) భర్త చింత సోమయ్య గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనసు పర్థలు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 :00గంటలకి ఇంట్లో హాస్పిటల్ కి వెళ్తున్నాను అని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు, ఒకరోజు చూసి స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెడతామని అన్నారు, ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు గులాబీ రంగు చీరతో వెళ్లిందని తెలియజేశారు. ఎవరైనా ఆచూకీ తెలిసినవారు ఈ కింది నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

8374083990,9121996843,9553554015.IMG-20240623-WA0013

Views: 19

About The Author

Post Comment

Comment List

Latest News