ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం కొరకు దరఖాస్తుల స్వీకరణ.
On
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం కొరకు దరఖాస్తుల స్వీకరణ.
.
ఎల్బీనగర్, జూన్ 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరం కొరకు సంస్కృతం-1, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్-2, స్టాటిస్టిక్స్-1 మొత్తం 3 సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నియామకం చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. జ్యోత్స్నప్రభ తెలియజేశారు. సంబంధిత పీజీలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. సంబంధిత సబ్జెక్టులో నెట్, స్లెట్, సెట్, పిహెచ్.డి. ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. అలాగే ఇంతకుముందు డిగ్రీ కళాశాలలో బోధనానుభవం ఉన్నవారు సర్వీస్ సర్టిఫికెట్ జతచేయగలరు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తేదీ 01.07.2024 సాయంత్రం వరకు కళాశాలలో తమ దరఖాస్తులను సమర్పించవలసిందిగా ప్రిన్సిపాల్ తెలియజేశారు.
Views: 15
Comment List