కొత్తగూడెం ప్రభుత్వఆసుపత్రి లో నల్ల బ్యాడ్జీలతో డాక్టర్ల నిరసన
ప్రభుత్వ ఆస్పత్రులపై ఇతర శాఖ అధికారుల పెత్తనం వద్దు
నల్గొండ వైద్య సిబ్బందికి సంఘీభావంగా నిరసన
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ఇండియా బ్యూరోనరేష్) జూన్28: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ,మెడికల్ కళాశాల వైద్యులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. నల్లగొండ కలెక్టర్ వైద్య సిబ్బంది , ప్రభుత్వ ఆస్పత్రులపై తమకన్నా కింది స్థాయి సిబ్బందితో పర్యవేక్షించి , వారికి ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని తెలపడం సమంజసంకాదు అని, అయినా మా పై వైద్య అధికారులు ఉండగా, ఇతర శాఖలొని మాకన్నా కిందిస్థాయి అధికారులు పర్యవేక్షణ ఉండకూడదని అన్నారు. ఇలా పర్యవేక్షించాలంటే కలెక్టర్ ,అడిషనల్ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ఉండాలన్నారు. ఆస్పత్రిలో కనీసం డాక్టర్లకు, సిబ్బందికి కనీస వసతుల విషయం గురించి పట్టించుకోవాలన్నారు తెలిపారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం కాకూడదని అన్నారు . ఈ కార్యక్రమంలో టీటీజీడిఎ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరాజు, టిటిజిడిఏ ట్రెజరర్ సురేందర్, ఆర్ఎంఓ పుష్పలత, సునీల్ దత్, నవ దీప్, రాంప్రసాద్, తిరుపతి, స్టాఫ్ నర్స్లు కృష్ణకుమారి, భూమమ్మ, విజయ కుమారి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Comment List