నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరుగుతాయి: ట్రాఫిక్ ఎస్సై నరేష్

ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

On
నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరుగుతాయి: ట్రాఫిక్  ఎస్సై నరేష్

నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి : ట్రాఫిక్ ఎస్సై నరేష్ 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జూన్ 28:నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ ఎస్సై కె నరేష్ అన్నారు. కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో డీఎస్పీ అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ట్రాఫిక్ ఎస్సై కె .నరేష్ మాట్లాడుతు ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి ప్రయాణికులను సురక్షితంగా మ్యస్థానాలకు చేర్చాలన్నారు. లైసెన్స్‌ తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడుపొద్దని, వాహనాలకు ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలని సూచించారు. నూతన ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సామజిక బాధ్యతగా క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 38
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News