మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్

ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి

On

 

 

 

IMG-20240718-WA1188IMG-20240718-WA1188

చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సి. ఐ రాయల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులతో గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో పిల్లల భవిష్యత్‌ అంధకారంగా మారుతుందని, వాటికి దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌ నాశనమవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. మత్తు పదార్దాల వల్ల జరిగే అనర్దాలను విద్యార్థులు తమ తల్లితండ్రులకు వివరించాలని, మత్తు పదార్దాలకు సంబందించిన సమాచారం తెలిస్తే సమీపంలో పోలీస్‌ వారికి తెలియజేయాలని సూచించారు.

Views: 89
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ ను  పరామర్శించిన మంత్రి తుమ్మల ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు....
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్