ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

పూజలో మహిళ పుస్తె మెట్టెలు దుస్తువులు... •ఈ క్షుద్ర పూజలో జంతువును బలి...

ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

భూ వివాదాల నేపథ్యంలో చేయించినవే తొరూర్ ఎస్ఐ కూచిపూడి జగదీష్IMG-20240731-WA0002

క్షుద్ర పూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫత్తేపురం గ్రామ శివారులోని జామాయిల్ తోటలో క్షుత్రపూజలు జరిగిన ఆనవాలు ఉన్నాయి. తోటలోకి వెళ్లిన పలువురు యువకులు అక్కడి దృశ్యాలను చిత్రీకరించి గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. అసలు ఆ తోటలో ఎందుకోసం పూజలు జరిగాయి, ఏం జరిగిందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పూజలో ఓ మహిళా దుస్తువులు, మట్టెలు, కమ్మలు, పుత్తెలు, నిమ్మకాయలు, రెండు కత్తులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అక్కడే ఓ జంతువును భలి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రామ ప్రజలు నిత్యం కొలిచే బాలమైసమ్మ దేవాలయం సమీపంలో జరుగడంతో ప్రజలు దేవాలయం సమీపంలో ఇలాంటి పూజలు,ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈ విషయం పై తొర్రూరు ఎస్సై కూచిపూడి జగదీష్ వివరణ కోరగా... జమాల్ తోట పక్కన ఉన్న స్థలము 65 లక్షలకు అమ్మకానికి ఉండడంతో అట్టి స్థలము అమ్ముడు పోకూడదని ఇలాంటి క్షుద్ర పూజలకు పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా ఇలాంటి అవరోధాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

Views: 152
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..