నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం
అవినీతి రహిత పాలనే నా ధ్యేయం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ క్యాంపస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు
*అధికారులతో కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను
*నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తా
*త్వరలో గ్రామాల పర్యటన షెడ్యూల్ విడుదల చేస్తా ఎమ్మెల్యే కడియం శ్రీహరి
*పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సభ్యులు మరియు ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయమని మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి స్పష్టం చేశారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తామని అన్నారు. ఘనపూర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సభ్యులు మరియు ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ... గౌరవ ముఖ్యమంత్రివంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులను అందజేయడం జరిగిందన్నారు. వాటికి సంబంధించి అక్టోబర్ 15 లోపు ఉత్తర్వులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానంగా స్టేషన్ ఘనపూర్ హెడ్ క్వార్టర్ లో వంద పడకల ఆసుపత్రి నిర్మించి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకోవడం జరిగిందని అన్నారు. గతంలో ఆర్టీసీకి గిఫ్ట్ గా ఇచ్చిన నాలుగు ఎకరాల భూమిని హెల్త్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలని కోరడం జరిగిందని, వాటికి సంబంధించి అనుమతులు కూడా వస్తాయన్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయల సముదాయాల భవనం ఏర్పాటు మంజూరు కాబోతుందని తెలిపారు.. నియోజకవర్గంలో ఆర్.ఎస్ ఘనపూర్ నుండి నవాబుపేట రిజర్వాయర్ కు వెళ్లే ప్రధాన కాలువ పూడికతీత లైనింగ్ పనులు త్వరలోనే మంజూరు కాబోతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా జఫర్గడ్ పెద్ద చెరువును ఆన్లైన్ రిజర్వాయర్ చేసుకోబోతున్నామని అన్నారు. అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుండి కుడి కాలువ ద్వారా రఘునాథ్ పల్లి, లింగాల గణపురం మండలంతో పాటు జిడికల్ వరకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా, ఆ కాలువ పనులను బిల్స్ అందకపోవడం వల్ల ఆగిపోయాయి, ఆ విషయాన్ని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ మూడు ఇరిగేషన్ పనులతో పాటు 104 కోట్ల రూపాయలతో వేలేరు, చిల్పూరు మండలాల్లో ఉన్న ఎత్తైన గ్రామాలకు సాగునీరు అందించాలని ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసుకున్నామని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ పనులన్నీ పూర్తయితే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు గోదావరి జలాల ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీటితోపాటు ఆర్ అండ్ బి నుండి 100 కోట్లు మరియు పంచాయతీరాజ్ నుండి 100 కోట్లు తో ప్రధానమైన రోడ్ల విస్తరణ పనులు చేపట్టబోతున్నామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లను మంజూరి ఇవ్వబోతుందని అన్నారు. మొదటి విడతగా 25 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ క్యాంపస్ ల నిర్మాణానికి మంజూరు ఇవ్వగా వాటిలో స్టేషన్ ఘనపూర్ ఒకటని అన్నారు. త్వరలో అధికారులతో కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామాల పర్యటన షెడ్యూల్ విడుదల చేస్తానాని తెలియజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జెండాను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ప్రెసిడెంట్ గా,జిల్లా అధ్యక్షులుగా, మండల అధ్యక్షునికి నామినేషన్ ల ప్రక్రియ జరుగుతుందని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వరకు యువజన కాంగ్రెస్ ఎన్నికలకు ఒక మాట మీద ఉండి, మండల సమన్వయ కమిటీ ద్వారా ఒక వ్యక్తిని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తే ఆ వ్యక్తికే నా మద్దతు ఇస్తానని తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టి పేదల కోసం అందించే, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారికి అందజేస్తూ, అవినీతి నిర్మూలన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List