22 సార్లు రక్తదానం చేసిన ప్రాణదాత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెరుగు మల్ల రాజు..
సోషల్ మీడియా గ్రూప్ ద్వారా వచ్చిన వార్త స్పందించిన ప్రాణదాత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
On
రక్తదానం చేస్తున్న మెరుగుమల రాజు
న్యూస్ ఇండియా తెలుగు, ఆగస్టు 23 (నల్గొండ జిల్లా ప్రతినిధి): సూర్యాపేట ఆదిత్య హాస్పిటల్ లో 6 సం.వయసు కలిగిన ఫైజాన్ కి అత్యవసరంగా B+పాజిటివ్ రక్తం అవసరమై సూర్యాపేట బ్లడ్ సోల్జర్స్ వాట్సప్ గ్రూప్ లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఘని హుస్సేన్ సమాచారం పోస్ట్ చేయగా సమాచారం చూసి స్వయంగా ప్రాణ దాతలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్ తానే వెళ్లి తన 22వ సారి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రాణ పాయ స్థితిలో ఉన్నా వారికి మానవతా దృక్పథంతో మంచి మనసుతో స్పందించి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి మరొక 3 ప్రాణాలను కాపాడి ప్రాణ దాతలు కావాలని కోరుతున్నాను. ఎవరికైనా అత్యవసరంగా బ్లడ్ అవసరం ఉంటే 9951820418 ఈ నెంబర్ కి ఫోన్ చేయవచ్చు అని తెలియజేశారు.

Views: 121
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Jan 2026 18:09:56
వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసాసీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీదేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్...

Comment List