గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకోవాలి

లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి

On

IMG-20240904-WA1301 లక్ష్మీదేవిపల్లి(న్యూస్ ఇండియన్)సెప్టెంబర్3: లక్ష్మీదేవిపల్లి మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలని లక్ష్మిదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి బుధవారం తెలిపారు . ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలో గల గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతులు తీసుకోవడంతో పాటు , ప్రతిమ ఎత్తు, ప్రదేశం, నిమజ్జనం తేదీ, మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . అదే విధంగా విద్యుత్ శాఖ అనుమతితో మండపాల వద్ద విద్యుత్ ని వినియోగించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మండప నిర్వహకులు ,ఫోన్ నెంబర్ గాల ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు.వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు చేసుకునేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమలులోకి తెచ్చిందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Views: 20
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..