మేకడోన గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టకు స్థలం కేటాయించండి.
- పెద్దకడుబూరు మండలం తహసీల్దార్ కి - మేకడోన గ్రామస్తులు వినతి.
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 05 :- పెద్దకడుబూరు మండల పరిధిలోని మేకడోన గ్రామంలో నూతన అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించాలని గురువారం గ్రామస్తులు కలిసి తహసీల్దార్ శ్రీనాథ్ కి వినతి పత్రం అందజేశారు. మేకడోన గ్రామంలో దాదాపు 2వేలకు పైగా అన్ని కులాలకు సంబందించిన కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారు. పేదలు, దనికులు అనే తేడా లేకుండ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని చట్టాలను రాసి రాజ్యాంగంలో పొందుపరిచి అందరికి సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహం గ్రామంలో ఉంటే అందరికి ఆదర్శంగా నిలుస్తారని గ్రామస్తుల కోరిక. వినతి పత్రంలో గ్రామస్తులు రాసిన వివరాల్లో అనగారిన వర్గాల ఆశాజ్యోతి దేశంలో విద్య , ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం సౌబ్రాతుత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేసిన దార్షనికులు ప్రపంచ మేధావుల్లో అగ్రగన్యులు, మానవతా సూత్రాలను తెలియపరిచిన మహానుభావులు అంబేద్కర్ విగ్రహాన్ని మేకడోన గ్రామంలోని బస్టాండ్ ఆవరణంలో ప్రభుత్వ స్థలమును చూసి విగ్రహ ప్రతిష్టకు కేటాయించాలని గ్రామస్తులు వినతి పత్రం ద్వారా తహసీల్దార్ ని కోరారు...ఈ కార్యక్రమంలో బుట్టి నరసయ్య ,బి ఈరన్న, బుట్టి సత్య, ప్రసన్న బాబు, వన్నప్ప, బజ్జప్ప, నరసప్ప, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.
Comment List